: కేసీఆర్ ను ఆకాశానికెత్తేసిన దాసరి


'బస్తీ' పాటల విడుదల కార్యక్రమంలో దర్శకరత్న దాసరి నారాయణరావు తనదైన శైలిలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ఆకాశానికెత్తేశారు. కేసీఆర్ కళలు, కళాకారుల గురించి తెలిసిన వ్యక్తి అని, కళాకారులను ఎంత గౌరవించాలో తెలిసిన వ్యక్తి అని కొనియాడారు. తనకు తెలిసి కేసీఆర్ ఓ ఆడియో ఫంక్షన్ కు రావడం ఇదే తొలిసారి అని అన్నారు. ఇక, కేసీఆర్ పై ఈ సందర్భంగా ఓ ఛలోక్తి విసిరారు. సీఎం కేసీఆర్ ఇటీవలే బస్తీలను బాగు చేసే కార్యక్రమాలకు ఎక్కువగా వెళుతున్నారని, ఇది కూడా 'బస్తీ' అనుకునే వచ్చి ఉంటారని ఎవరో తనతో అన్నారని తెలిపేసరికి వేదికపై ఉన్న అందరూ నవ్వేశారు. ఇక, చిన్న సినిమాల నిర్మాతలను ఆదుకోవాలని, పరిస్థితిలో మార్పు తేవాలని సీఎం కేసీఆర్ ను కోరారు.

  • Loading...

More Telugu News