: 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో కొత్త స్మార్ట్ ఫోన్
ఇప్పుడు మార్కెట్లో ఉన్న స్మార్ట్ ఫోన్లలో అధిక శాతం మహా అయితే 2500 ఎంఏహెచ్, లేక, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగివుంటాయి. ఫోన్ వాడకం ఎక్కువైతే చార్జర్ తో పనికూడా ఎక్కువగానే ఉంటుంది, మరి, అలాంటి బాధలేమీ లేకుండా ఉండేందుకు, ఒక్కసారి చార్జింగ్ చేస్తే వారం రోజుల పాటు పనిచేసేలా ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ను చైనా కంపెనీ ఆకిటెల్ అభివృద్ధి చేస్తోంది. దీంట్లో 10,000 ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. జియోనీ కంపెనీ కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ మారథాన్ ఎం5 లో 6,020 ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ పొందుపరిచారు. ఇప్పుడు ఆకిటెల్ అభివృద్ధి చేస్తున్న స్మార్ట్ ఫోన్ లోని బ్యాటరీ దానికంటే అధిక సామర్థ్యం కలది కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.