: మోదీ కాళ్లు పట్టుకునైనా కేసు నుంచి బయటపడాలని చూస్తున్నారు: బాబుపై బొత్స ధ్వజం


ఇటీవలే వైసీపీలో చేరిన బొత్స సత్యనారాయణ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రధాని మోదీ కాళ్లు పట్టుకునైనా ఓటుకు నోటు వ్యవహారం నుంచి బయటపడాలని చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఏపీ పరువు తీశారని మండిపడ్డారు. రాజకీయాలను వ్యాపారంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఇతర వైసీపీ నేతలు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ కూడా చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశారు. మత్తయ్యకు చంద్రబాబు ఆశ్రయం కల్పించడం సిగ్గుచేటని అంబటి వ్యాఖ్యానించారు. ముడుపుల కేసు నుంచి చంద్రబాబు తప్పించుకోలేరని పద్మ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News