: గీతాలాపనతో తోటి విద్యార్థులను అలరించిన వెంకటేశ్ తనయుడు


టాలీవుడ్ హీరో వెంకటేశ్ తనయుడు అర్జున్ దగ్గుబాటి తన స్కూల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తన గానమాధుర్యంతో అందరినీ అలరించాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో వరల్డ్ మ్యూజిక్ డే నేపథ్యంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్జున్ తన మ్యూజిక్ బ్యాండ్ 'ద టర్నింగ్ పాయింట్'తో కలిసి ప్రదర్శన ఇచ్చాడు. చేతిలో గిటార్ పట్టుకుని, ప్రేమ గీతాలు పాడి విద్యార్థులను, స్కూలు సిబ్బందిని సమ్మోహితులను చేశాడు. కాగా, అర్జున్ కచేరీకి హాజరైన శ్రోతల్లో అతని సోదరీమణులు కూడా ఉన్నారట. మరి అర్జున్ తన తండ్రి వెంకటేశ్, అన్న రానా బాటలో నటుడవుతాడో, తనకిష్టమైన సంగీత రంగంలో ప్రవేశిస్తాడో చూడాలి.

  • Loading...

More Telugu News