: మధ్యప్రదేశ్ లో చంపిన జర్నలిస్టును మహారాష్ట్రలో పూడ్చిపెట్టారు!


దేశంలో పాత్రికేయుల భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా, ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు మృత్యుఘంటికలు మోగుతున్నాయి. కొన్ని రోజులుగా జర్నలిస్టులపై హత్యాకాండ యథేచ్ఛగా సాగిపోతోంది. తాజాగా, మధ్యప్రదేశ్ కు చెందిన సందీప్ కొఠారి (44) అనే విలేకరి ఈ నెల 19 నుంచి కనిపించడం లేదంటూ అతడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులకు నివ్వెరపరిచే నిజాలు తెలిశాయి. ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని 'తమదైన శైలి'లో ప్రశ్నించడంతో అతడిని తామే చంపామని అంగీకరించారు. మధ్యప్రదేశ్ లో అతడిపై దాడిచేసి, ఆపై నిప్పంటించి హత్య చేశామని వివరించారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లాలో పూడ్చిపెట్టామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News