: కసిగా బంతులు విసిరి మళ్లీ 5 వికెట్లు తీసిన ముస్తాఫిజూర్... మ్యాచ్ కు వాన పోటు


మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మిర్పూర్ లో జరుగుతున్న రెండో వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించాడు. 43.5 ఓవర్ల వద్ద వర్షం పడడంతో మ్యాచ్ నిలిచిపోయింది. అప్పటికి భారత్ స్కోరు 8 వికెట్లకు 196 పరుగులు. తొలి మ్యాచ్ లో 5 వికెట్లతో సత్తా చాటిన లెఫ్టార్మ్ పేసర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్ మరోసారి ఐదు వికెట్లతో భారత్ వెన్నువిరిచాడు. తొలి వన్డేలో ధోనీ బలంగా ఢీకొనడంతో స్వల్పంగా గాయపడిన ఈ యువ కిశోరం నేటి మ్యాచ్ లో కసిగా బంతులు విసిరాడు. వికెట్లకు రెండు వైపులా బంతిని నాట్యమాడించాడు. దీంతో, భారత బ్యాట్స్ మెన్ కు అతడిని కాచుకోవడం కష్టంగా పరిణమించింది. రోహిత్ శర్మ (0), ధోనీ (47), రైనా (34), అక్షర్ పటేల్ (0), అశ్విన్ (4) ముస్తాఫిజూర్ ధాటికి బలయ్యారు.

  • Loading...

More Telugu News