: భూమికి 35,000 అడుగుల ఎత్తులో 'యోగా డే' నిర్వహించిన స్పైస్ జెట్


భారత్ లో పుట్టిన యోగా ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ కార్యదక్షత కారణంగా ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఆయన పట్టుబట్టి, ఐక్యరాజ్యసమితి పెద్దలతో మాట్లాడి, వారిని ఒప్పించడంతో 'వరల్డ్ యోగా డే' (జూన్ 21) సాకారమైంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా నేడు యోగా కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో చవక ధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ కూడా యోగా డే వేడుక నిర్వహించింది. భూమికి 35,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానంలో ప్రయాణికుల చేత సిబ్బంది యోగా చేయించారు. అయితే, కష్టమైన ఆసనాలు కాకుండా, సీట్లలో కూర్చుని వేయగలిగే ఆసనాలతో సరిపెట్టారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు యోగా సమాచారంతో కూడిన కరపత్రాలు, సీడీలు పంపిణీ చేశారు. ఇషా ఫౌండేషన్ తో కలిసి స్పైస్ జెట్ ఈ కార్యక్రమం చేపట్టింది.

  • Loading...

More Telugu News