: పుస్తక రూపంలో 'సమాచార మహాసముద్రం'... ధర 3.1 కోట్లు!


ప్రస్తుత కాలంలో మనకేదన్నా విషయం తెలియకపోతే వెంటనే వికీపీడియాను సందర్శిస్తాం. అందులో ఉన్న సమాచారంతో మన సందేహాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. దాదాపు అన్ని అంశాలకు చెందిన విషయాలను నిక్షిప్తం చేసుకున్న అపార విషయ భాండాగారమే వికీపీడియా. ఇప్పుడు దీన్ని పుస్తక రూపంలో తీసుకువస్తున్నారు. 7,600 వాల్యూంలతో వస్తున్న వికీపీడియా పూర్తి ప్రింట్ ఎడిషన్ ధర రూ.3.1 కోట్లుగా నిర్ణయించారు. విడిగా ఒక వాల్యూంను కొనుక్కోవాలంటే రూ.5 వేలు చెల్లించాలి. న్యూయార్క్ సిటీ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ సెంటర్, కాలేజ్ ఆఫ్ స్టాటెన్ ఐలాండ్ లో పాఠాలు బోధించే మైకేల్ మాండిబెర్గ్ వికీపీడియాను పుస్తక రూపంలోకి తెచ్చేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ కు రూపకల్పన చేశారు.

  • Loading...

More Telugu News