: రాయుడు డకౌట్... 25 ఓవర్లలో టీమిండియా స్కోరు 124/4


బంగ్లాదేశ్ తో రెండో వన్డేలో, అజింక్యా రహానే స్థానంలో జట్టులోకొచ్చిన తెలుగుతేజం అంబటి రాయుడు డకౌటయ్యాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవడంలో రాయుడు విఫలమయ్యాడు. రూబెల్ హుస్సేన్ బౌలింగ్ లో, పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. మిర్పూర్ వేదికగా జరుగుతున్న ఈ వన్డేలో భారత్ 25 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఓపెనర్ ధావన్ 53 పరుగులు చేయగా, మరో ఓపెనర్ రోహిత్ శర్మ (0) తీవ్రంగా నిరాశపరిచాడు. కోహ్లీ 23 పరుగులు చేసి నాసిర్ హుస్సేన్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ ఎంఎస్ ధోనీ (29 బ్యాటింగ్), సురేశ్ రైనా (11 బ్యాటింగ్) ఉన్నారు. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం తెలిసిందే.

  • Loading...

More Telugu News