: లైంగిక దాడి కేసులో బాలీవుడ్ కో-డైరెక్టర్ అరెస్టు


బాలీవుడ్ లో ఓ సహ దర్శకుడు రేప్ కేసులో అరెస్టవడం కలకలం రేపింది. మహ్మద్ ఫారూఖీ అనే కో-డైరెక్టర్ 2015 మార్చి 28న ఓ అమెరికా జాతీయురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయని, కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఫారూఖీ 'పీప్లీ లైవ్' సినిమాకు సహ దర్శకుడిగా పనిచేశాడు. రైతుల ఆత్మహత్యలను ప్రస్తావిస్తూ నిర్మించిన ఈ వ్యంగ్య చిత్రానికి అమీర్ ఖాన్ సహ నిర్మాత అన్న సంగతి తెలిసిందే. కాగా, కొలంబియా యూనివర్శిటీలో పీహెచ్ డీ చేస్తున్న సదరు అమెరికా మహిళ భారత్ వచ్చిన సమయంలో ఆమెపై ఫారూఖీ లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అరెస్టు చేసిన ఫారూఖీని న్యాయస్థానంలో హాజరుపర్చగా, జూలై 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

  • Loading...

More Telugu News