: వరల్డ్ యోగా డే సందర్భంగా ఐబీ హెచ్చరికలు

భారత్ లో వరల్డ్ యోగా డేను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా, తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుండగా, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ఉగ్రవాద దాడులు జరగవచ్చని, అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీచేసింది. దీంతో, ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. భారీగా భద్రతా బలగాలను మోహరించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలను, షార్ప్ షూటర్లను, డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దింపారు. ప్రధానంగా, యోగా వేడుకకు వేదికైన రాజ్ పథ్ ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవచ్చని ఐబీ హెచ్చరించింది. గగనతలం నుంచి డ్రోన్లతో దాడులు నిర్వహించే అవకాశాలున్నాయని అనుమానిస్తోంది. దీంతో, పలు నిషేధాజ్ఞలు విధించారు.