: ఫాదర్స్ డే అంటే ఏం చేస్తారు?: నాగార్జున


ఫాదర్స్ డే అంటే ఏం చేస్తారు? అని ప్రముఖ సినీ నటుడు నాగార్జున ప్రశ్నించారు. ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటారన్న ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు. తన దృష్టిలో ప్రతి రోజూ మదర్స్ డే, ఫాదర్స్ డే, సన్స్ అండ్ డాటర్స్ డే అని అన్నారు. తన వరకు అయితే పుట్టిన రోజే ఫాదర్స్ డే అని నాగార్జున చెప్పారు. తన పుట్టిన రోజున నాగ చైతన్య, అఖిల్ బహుమతులు ఇస్తారని, అంతా కలిసి ఒకే ఊర్లో ఉంటే ఏదైనా ప్రత్యేక ప్రోగ్రాం ప్లాన్ చేస్తారని నాగ్ చెప్పారు. వారిద్దరి చిన్నతనంలో తన పుట్టిన రోజు కోసం ప్రత్యేకంగా గ్రీటింగ్ కార్డులు తయారు చేసేవారని, వాటిల్లో స్వయంగా చిత్రాలు గీసేవారని నాగ్ తెలిపారు. అప్పటి గ్రీటింగ్స్ ఇంకా తనకు గుర్తున్నాయని, వాటిని దాచుకున్నానని నవ్వుతూ చెప్పారు.

  • Loading...

More Telugu News