: ఫేస్ బుక్ లో కేసీఆర్ పై కామెంట్స్ చేసిన వ్యక్తి అరెస్టు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ టీఆర్ఎస్ యువనేత ఫిర్యాదు చేయడంతో ఓ యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన నల్గొండలో చోటుచేసుకుంది. నల్గొండలోని కేశరాజుపల్లి ప్రాంతానికి చెందిన బొజ్జ రవికాంత్ అనే యువకుడు సీఎం కేసీఆర్ ఫోటో పోస్ట్ చేస్తూ, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు, మాన్యంచెల్కకు చెందిన టీఆర్ఎస్ నేత కత్తుల రమేష్ ఫిర్యాదు చేశారు. దీంతో రవికాంత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.