: విమానంలో యోగా... ప్రయాణికులకు కొత్త అనుభూతి


అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని స్పైస్ జెట్, ఎయిర్ ఇండియాకు చెందిన విమానాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ, అంతర్జాతీయ సర్వీసుల్లో యోగాను నిర్వహించారు. యోగాలో పాల్గొనడంపై పలువురు ఆసక్తి వ్యక్తం చేశారు. ఇంత ఎత్తులో యోగా చేయడం కొత్త అనుభూతిని ఇచ్చిందని, ఎత్తులో ఉండడంతో మానసిక ఆందోళన తగ్గించేందుకు యోగా ఉపయోగ పడిందని ప్రయాణికులు పేర్కొన్నారు. విమానాల్లో యోగా కార్యక్రమం నిర్వహించడం ద్వారా అసలు ప్రయాణం చేసినట్టే లేదని వారు అభిప్రాయపడ్డారు. యోగా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News