: నేటి నాన్న ఎంతో మారిపోయాడు!


నాన్నంటే ఎల్లప్పుడూ వెన్నంటి ఉండే నీడ... నాన్నంటే కంటికి రెప్పలా కాపాడే దేవుడు. అలాంటి నాన్న సమాజంలో మార్పులకు అనుగుణంగా ఎంతో మారిపోయాడు. చిన్నప్పటి నుంచీ తల్లితో ఎక్కువ అటాచ్ మెంట్ కలిగిన పిల్లలు నెమ్మదిగా తండ్రికి అలవాటు పడతారు. ఆలనాపాలన తల్లి చూసినా సంరక్షణ బాధ్యత మొత్తం తండ్రిదే. నాన్నే ప్రతి ఒక్కరికీ ఆదర్శం అంటే అతిశయోక్తి కాదు. చిన్నప్పుడు తండ్రంటే భయపడ్డ పిల్లలు కూడా, పెద్దయ్యాక తండ్రిలానే ఉండేందుకు ఆసక్తి చూపుతారు. ప్రత్యేకంగా ఆడపిల్లలకు తండ్రితో ఉన్న అనుబంధం వేరు. ఊరిలో ఎంత పలుకుబడి, పేరు ప్రతిష్ఠలు ఉన్నప్పటికీ, ప్రతి కుమార్తె దగ్గర తండ్రి జాగ్రత్తగానే ఉంటారు. ఆడపిల్ల ఏదడిగినా తెచ్చివ్వడానికి సంకోచించడు. అన్ని రకాలుగా ఆడపిల్లలకు రక్షణ కవచంగా నిలబడతాడు. అందుకే. పెళ్లై అత్తారింటికెళ్లినా తండ్రి కురిపించిన ప్రేమానురాగాలు ఏ ఆడపిల్లా మర్చిపోలేదు. అలాగే ఆడపిల్లకు హద్దులతో పాటు, స్వేచ్ఛను కూడా ఇచ్చేది తండ్రే. తండ్రి పక్కనుంటే ప్రపంచం మొత్తం ఎదురు తిరిగినా పోరాడేందుకు వెనుకాడరు. తండ్రి ఓ సారి వెన్నుతడితే ఆ అనుభూతే వేరు. ఉమ్మడి కుటుంబాల్లో తండ్రితో మాట్లాడాలంటేనే భయపడేవారు. కాల క్రమంలో తండ్రి చాలా మారాడు. గాంభీర్యం వదిలేశాడు. ఇంటికే అధికసమయం కేటాయించడం ప్రారంభించాడు. పిల్లలకు మార్గదర్శిగా ఉంటూ, స్నేహితుడిగా మారాడు. నేడు 'ఫాదర్స్ డే'ను పుస్కరించుకుని ప్రతి ఒక్కరూ తండ్రి త్యాగాలకు సలాం చేస్తున్నారు. గూగుల్ ప్రత్యేక డూడుల్ ను హోం పేజ్ లో పెట్టింది.

  • Loading...

More Telugu News