: చంద్రబాబు ఉగ్రవాదుల కంటే ప్రమాదకారి: తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి


నల్గొండ జిల్లాలో పోలీసులను మట్టుబెట్టిన సిమీ ఉగ్రవాదులకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాదకారి అని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 'టీ న్యూస్ కు నోటీసులివ్వడం అంటే దొంగలే పోలీసులకు నోటీసులిచ్చినట్టు' అని వ్యాఖ్యానించారు. 'తెలంగాణలో వుంది కనుక టీ న్యూస్ ఛానెల్ కు నోటీసులిచ్చారు. అదే తమిళనాడు, కర్ణాటకల్లో ప్రసారం చేసి ఉంటే ఇలాగే నోటీసులిచ్చి ఉండేవారా?' అని ఆయన విశాఖ పోలీసులను ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వైషమ్యాలు సృష్టించి లబ్ధి పొందుదామని చంద్రబాబు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News