: అనంతపురం టీవీఎస్ షోరూంలో అగ్నిప్రమాదం...దగ్ధమవుతున్న వాహనాలు
అనంతపురం పట్టణంలోని బళ్లారి కూడలిలో గల ఎమ్ జీ టీవీఎస్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ ఉదయం టీవీఎస్ షోరూంలో విడి భాగాలు ఉంచే గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, షోరూం అంతా వ్యాపించాయి. దీంతో పలు వాహనాలు మంటల్లో దగ్ధమవుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలార్పుతున్నారు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.