: యోగా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది: రాష్ట్రపతి


అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాల ప్రజలు యోగా ఆచరించడం శుభప్రదమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. యోగా వల్ల మానసిక, శారీరక రుగ్మతలు మాయమవుతాయని అన్నారు. గురువులు చెప్పిన విధంగా యోగాను ఆచరించడం వల్ల సర్వమానవాళి శ్రేయస్సు సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సరైన మార్గనిర్దేశకత్వంలో యోగాను ఆచరించాలని, ఇంతవరకు యోగాను ఆచరించని వాళ్లంతా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజుతో యోగాను ఆచరించడం ప్రారంభించాలని ఆయన సూచించారు. సనాతన భారత సంప్రదాయమైన యోగా ఉత్తమమైనదని ఆయన పేర్కొన్నారు. శరీరాన్ని, మనసును ఏకం చేసే శక్తి యోగాకు ఉందని ఆయన వివరించారు. రాష్ట్రపతి భవన్ లో ఢంకా బజాయించి యోగా వేడుకలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వేల సంఖ్యలో ప్రజలు యోగాసనాలు వేశారు.

  • Loading...

More Telugu News