: పక్షే కదా అని వదిలేయలేదు... ప్రాణం నిలిపాడు!


'పక్షే కదా, ప్రాణం పోతే ఏం పోయిందిలే' అనుకోలేదతను. ఎలాగైనా దానిని రక్షించాలని భావించాడు. అంతే, 18 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి దానికి ప్రాణదానం చేశాడు. ఆ వివరాల్లోకి వెళితే, కర్ణాటకకు చెందిన అంకుష్ శర్మ సైక్లిస్ట్. త్వరలో జరగబోయే సైక్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు భార్య టిన్ టిన్ శర్మ, స్నేహితుడు లియాండర్ తో కలిసి ప్రాక్టీస్ చేస్తుండగా, ఆకునూరు సమీపంలో ఓ గద్ద తీవ్రంగా గాయపడి, కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో దానిని ఎలాగైనా కాపాడాలని అంకుష్ శర్మ నిర్ణయించుకున్నాడు. దగ్గర్లో వెటర్నరీ ఆసుపత్రి ఉందేమోనని ఆరాతీయగా, 25 కిలో మీటర్ల దూరంలో ఉందని స్థానికులు తెలిపారు. దీంతో దానిని జాగ్రత్తగా పట్టుకుని, సైకిల్ తొక్కుకుంటూ 18 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇంతలో అటుగా వస్తున్న కారు కనిపించడంతో దానిని ఆపి సహాయం అడిగాడు. కారు యజమాని గద్దను కాపాడేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో కారులో గద్దను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. గద్ద ప్రాణాలతో బయటపడి కోలుకుంటోందట. తన ప్రయత్నం ఫలించినందుకు అతని ప్రాణం కూడా కుదుటపడింది!

  • Loading...

More Telugu News