: ఎలక్షన్ కమిషన్ కొత్త ప్రయోగం...ఉప ఎన్నికలతో ఆరంభం


ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు జాతీయ ఎలక్షన్ కమిషన్ సరికొత్త విధానాన్ని అవలంబించనుంది. ఇప్పటి వరకు బ్యాలెట్ పై పార్టీ గుర్తు, అభ్యర్థుల పేర్లతో ఎన్నికలు నిర్వహించిన ఎలక్షన్ కమిషన్, తాజాగా ఈవీఎంలపై పార్టీ గుర్తు, అభ్యర్థి పేరు సహా, ఫోటోను కూడా ముంద్రించనుంది. దీంతో ఓటర్లు గందరగోళం పడకుండా, ఓటు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఎలక్షన్ కమిషన్ భావిస్తోంది. ఈ నెల 27న తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, త్రిపురల్లో జరగనున్న ఉపఎన్నికల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జాతీయ ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. భవిష్యత్ లో జరగనున్న ఎన్నికల్లో ఇదే విధానం అవలంబించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ కార్యదర్శి కేఎన్ బార్ తెలిపారు.

  • Loading...

More Telugu News