: ప్రధాని మౌనం వీడాలి...సుష్మ, వసుంధర రాజీనామాలు చేయాలి: జైరాం
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె తక్షణం రాజీనామా చేయాలని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ పర్యటన సందర్భంగా హైదరాబాదులోని గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ, లలిత్ మోదీ వ్యవహారంపై ప్రధాని మోదీ ఇంకా మౌనం వహించడం సరికాదని అన్నారు. నల్లధనం వెలికితీస్తామని, అవినీతిని అంతమొందిస్తామని అధికారంలోకి వచ్చిన ఎన్డీయే, దాని మిత్ర పక్షం టీడీపీ వాటిని పూర్తిగా విస్మరించాయని ఆయన విమర్శించారు.