: పోలీస్ ఇన్ స్పెక్టర్ ను తరిమితరిమి కొట్టిన మహిళ
పోలీసుల తీరుపై ఆగ్రహించిన ఓ మహిళ ఎస్సైని తరిమితరిమి కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. యూపీలోని ఛత్తార్ పూర్ గ్రామంలో ఇటీవల ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. అతని కుటుంబ సభ్యులు అనుమానితుల గురించిన సమాచారం పోలీసులకు అందించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు నిందితులపై ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. ఈ నేపథ్యంలో గ్రామానికి ఎస్సై వచ్చారు. హత్య కేసును నీరుగారుస్తున్నారంటూ గ్రామస్థులు ఎస్సై ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులకు ఎందుకు కొమ్ముగాస్తున్నారంటూ ఎస్సైని ప్రశ్నించారు. ఇంతలో ఓ మహిళ ఎస్సైపై దాడికి దిగింది. ఆమె కొట్టిన దెబ్బలకు తాళలేక ఎస్సై పరుగు లంఘించుకున్నా, ఆమె తరిమితరిమి కొట్టింది.