: 'బాహుబలి' కోసం ఎదురు చూస్తున్నా: అమితాబ్ బచ్చన్


ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'బాహుబలి' సినిమా విడుదల కోసం సినీ దిగ్గజాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారతీయ సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్ 'బాహుబలి' సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు. రానాతో చేసిన వీడియో చాట్ లో ఆయన ఈ విషయం వెల్లడించారు. ట్రైలర్ చూస్తుంటే హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతోందని ఆయన తెలిపారు. భారతీయ సినీ చరిత్రలో ఇలాంటి సినిమా వచ్చిందని తాను భావించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, జూలై 10న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 'బాహుబలి' సినిమా విడుదల కానుంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో కనువిందు చేయనున్నారు.

  • Loading...

More Telugu News