: బీహార్ రాజకీయాల్లో రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు!


బీహార్లో 'రావణాసురుడు', 'కుంభకర్ణుడు', 'విభీషణుడు' తిరుగుతున్నారు. బీహార్ రాజకీయాలు వేడెక్కడంతో రామాయణంలోని పాత్రలు పరకాయప్రవేశం చేస్తున్నాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు హిందుత్వను బలంగా నమ్ముకున్నాయి. దీంతో ప్రచారం సందర్భంగా విమర్శనాస్త్రాలు సంధించేటప్పుడు భారతంపై పట్టును ప్రదర్శించేందుకు నేతలంతా తహతహలాడుతున్నారు. జేడీయూలో వివాదం రేపి బీజేపీ మద్దతుదారుగా మారిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి జతిన్ రాం మాంఝీని 'విభీషణుడు'గా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. దీనిపై సమాధానమిచ్చిన మాంఝీ, నితీష్ కుమార్ ను 'రావణాసురుడు'తో పోలుస్తున్నారు. బీహార్ లో 'రావణాసురుడి' పాలనను అంతం చేస్తామని ప్రతిన పూనుతున్నారు. అలాగే పనిలో పనిగా లాలూ ప్రసాద్ యాదవ్ ను 'కుంభకర్ణుడు'తో పోల్చారు. చాలా కాలం తరువాత మేల్కొన్న 'కుంభకర్ణుడు' బీజేపీని ఏమీ చేయలేడని మాంఝీ తెలిపారు. బీహార్ నేతల తాజా విమర్శలతో రామాయణంలోని పాత్రలన్నీ బీహారీ రాజకీయవేత్తల రూపాల్లోకి పరకాయప్రవేశం చేసినట్టున్నాయని పలువురు వ్యంగ్యం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News