: అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో తగ్గిన బంగారం, వెండి ధరలు


గత రెండు, మూడు రోజుల నుంచి డాలర్ పతనంతో పుంజుకున్న పసిడి ధరలు ఈ రోజు అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం, డిమాండ్ తగ్గడంతో తగ్గాయి. అటు వెండి విలువ మరింత తగ్గింది. ఈ నేపథ్యంలో బంగారం ధర రూ.100 తగ్గి 10 గ్రాములు రూ.27,100 పలుకుతోంది. ఇక వెండి ధర ఈ రోజు కూడా రూ.25 తగ్గి కేజీ ధర రూ.37,025 ఉంది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడటం, నగల వ్యాపారులు కొనుగోళ్లు చేపట్టకపోవడం ధరల తగ్గుదలకు కారణమని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News