: బ్రెస్ట్ ఇంప్లాంట్స్ లో కొకైన్ తరలిస్తున్న భామ... అరెస్ట్


మాదక ద్రవ్యాలను తరలించే స్మగ్లర్లు తాము పట్టుబడకుండా ఉండేందుకు ఎన్నో రకాల పద్ధతులను పాటిస్తుంటారు. తాజాగా ఓ మహిళ స్మగ్లింగ్ కు పాల్పడిన విధానం అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే, కొలంబియా రాజధాని బొగొటాలో ఒక హొండ్యూరన్ మహిళ తన వక్షస్థలంలోని ఇంప్లాంట్స్ లో ఏకంగా ఒకటిన్నర కేజీల ద్రవరూప కొకైన్ తరలిస్తూ ఎయిర్ పోర్టులో పట్టుబడింది. 22 ఏళ్ల వయసున్న పావోలా డెయనిరా సబిల్లాన్ అనే మహిళ స్పెయిన్ కు వెళ్లేందుకు ఎయిర్ పోర్టు చేరుకుంది. అయితే, ఆమె కొంచెం కంగారు పడుతున్నట్టు అనుమానం రావడంతో అధికారులు అదుపులోకి తీసుకుని, ప్రశ్నించారు. అనంతరం ఆమెను ఎక్స్ రే తీయగా వక్షస్థలంలో ఏదో ఉన్నట్టు కనపడింది. అనంతరం విచారించగా కొకైన్ ను బ్రెస్ట్ ఇంప్లాంట్స్ లో పెట్టుకుని బార్సిలోనా వెళుతున్నట్టు పావోలా ఒప్పుకుందని పోలీసు అధికారులు తెలిపారు. పశ్చిమ కొలంబియాలోని పెరీరా నగరంలో ఉన్న ఒక క్లినిక్ లో ఆమెకు బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ జరిగిందని చెప్పారు. బొగొటాలోని ఒక ఆసుపత్రిలో పావొలాకు సర్జరీ చేసి ఇంప్లాంట్స్ ను తొలగించామని వెల్లడించారు. ప్రతి ఏడాది కొలంబియాలో 300 టన్నుల కొకైన్ ఉత్పత్తి అవుతోంది. అంతేకాకుండా, ఇక్కడ నుంచి ప్రపంచంలోని నలుమూలలకూ ఎగుమతి అవుతోంది.

  • Loading...

More Telugu News