: సముద్రం మధ్యలో నిలిచిన 50 మరపడవలు
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలను వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో పలువురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయారు. తీరంలో అలల తాకిడి క్రమేపీ పెరుగుతుండడంతో తీరం చేరడం కష్టమని భావించిన మత్స్యకారులు సముద్రంలోనే ఉండిపోయారు. మత్స్యకారుల కుటుంబాలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, సముద్రంలో నిలిచిన మత్స్యకారులు వారికి సమాచారం అందించారు. గుంటూరు జిల్లా నిజాంపట్నం సమీపంలో 50 మరపడవలకు సముద్రంలోని సురక్షిత ప్రాంతంలో లంగరేసి నిలిపినట్టు వారు కుటుంబ సభ్యులకు తెలిపారు. ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నామని, ఆందోళన చెందవద్దని వారు పేర్కొన్నట్టు సమాచారం.