: రోడ్డు ప్రమాదంలో సినీ నటి కవితకు గాయాలు
సినీ నటి, టీడీపీ నాయకురాలు కవిత కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆమె దగ్గరలోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. రహదారిపై ఆగి ఉన్న లారీని కవిత కారు ఢీకొట్టడంతో ఈ స్వల్ప ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. అనంతరం కవిత హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు.