: ఆశారాం బాపుకు బెయిల్ నిరాకరణ
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు బెయిల్ విషయంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జోథ్ పూర్ లోని జిల్లా అదనపు సెషన్స్ జడ్జి మనోజ్ కుమార్ వ్యాస్ బెయిల్ తిరస్కరించారు. ఈ మేరకు 73 ఏళ్ల ఆశారాం పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును కొట్టివేశారు. అటువంటి రీతిలో నేరానికి పాల్పడ్డ నిందితుడు బెయిల్ పోందేందుకు అర్హుడు కాడని జడ్జి పేర్కొన్నారు. ఈ రోజు కోర్టులో ఆశారాం తరపున బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి వాదనలు వినిపించారు. ఓ మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణతో సెప్టెంబర్ 2013లో ఆశారాం అరెస్టయ్యారు. అప్పటినుంచి నేటి వరకు బెయిల్ కోసం ఆరుసార్లు ఆయన పెట్టుకున్న దరఖాస్తులను కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది.