: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులపై కేసులు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులపై కేసులు నమోదయ్యాయి. బీఎస్ యడ్యూరప్ప, హెచ్ డీ కుమారస్వామిలపై అక్రమ భూ డీనోటిఫికేషన్ కేసులో మూడు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. కాగ్ నివేదిక ఆధారంగా జయకుమార్ హీరేమత్ అనే ఆర్టీఐ కార్యకర్త 2012 సంవత్సరంలో లోకాయుక్తకు చేసిన ఫిర్యాదు ఫలితంగా ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. కుమారస్వామి, యడ్యూరప్ప ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ (బీడీఏ) 2007 నుంచి 2012 వరకు కేటాయించిన భూములు డీనోటిఫై చేయడాన్ని అప్పట్లో కాగ్ తప్పుబట్టింది. దీనిపై సీఐడీ విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా కాగ్ పేర్కొన్నది నిజమని నిర్ధారించిన అధికారులు, కుమారస్వామిని ఏ1 గాను, యడ్యూరప్పను ఏ2గాను పేర్కొంటూ ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.