: రెండు రాష్ట్రాలూ పోటీపడి తప్పులు చేస్తున్నాయి: కిషన్ రెడ్డి
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న రాజకీయ వివాదంపై టీ.బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మొదటిసారి మాట్లాడారు. రెండు రాష్ట్రాలు పోటీపడి తప్పులు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ పోలీసులు సర్కారుకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా తమకుందన్న కిషన్ రెడ్డి, మీడియా స్వేచ్ఛకు బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అయితే టీ.న్యూస్ కు ఏపీ ప్రభుత్వం నోటీసులు పంపడంపై మండిపడుతున్న కేసీఆర్ ప్రభుత్వం, ఏబీఎన్ చానల్ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.