: బ్రిటన్ లో లలిత్ మోదీ భారీ పెట్టుబడులు... లండన్ లో స్థిర నివాసానికి యత్నాలు


ఐపీఎల్ లో పలు అక్రమాలకు పాల్పడటమే కాక బీజేపీ సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తున్న లలిత్ మోదీ భారత్ కు వచ్చే అవకాశాలు లేవనే చెప్పాలి. ఎందుకంటే, లండన్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే దిశగా ఆయన తన యత్నాలను ముమ్మరం చేశారు. దేశంలో భారీ పెట్టుబడులు పెట్టే వ్యక్తులకు బ్రిటన్ శాశ్వత పౌరసత్వం ఇస్తోంది. దీనిని అవకాశంగా మలుచుకునేందుకు రంగంలోకి దిగిన లలిత్ మోదీ, అక్కడి పారిశ్రామిక సంస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఒక్కసారి బ్రిటన్ శాశ్వత పౌరసత్వం లభిస్తే, ఇక మోదీ భారత్ గడ్డపై అడుగుపెట్టే అవకాశమే ఉండదన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News