: 'సాక్షి' చానల్ కు పోస్టులో నోటీసులు పంపాం: విశాఖ డీసీపీ త్రివిక్రమ్ వర్మ
ఓటుకు నోటు కేసులో 'సాక్షి' చానెల్ కు పోస్టులో నోటీసులు పంపించామని విశాఖ డీసీపీ త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు. టి.వార్తా చానెల్ కు ఏసీపీ రమణ స్వయంగా నోటీసులు ఇచ్చారని చెప్పారు. ప్రసాద్ అనే స్థానిక న్యాయవాది ఈ నెల 7న సాక్షి టీవీ, టీ న్యూస్ పై ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో చానళ్లపై కేసు నమోదుచేసి, నోటీసులు ఇచ్చినట్టు వర్మ చెప్పారు. కాగా సాక్షికి పంపిన నోటీసులు అందాయా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు టి.న్యూస్ కు నోటీసులు ఇవ్వడంపై తెలంగాణలో పలువురి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.