: ఢిల్లీలో సుష్మా నివాసం ఎదుట 'ఆప్ యూత్ వింగ్' నిరసన
ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీకి వీసా డాక్యుమెంట్ల విషయంలో సాయం చేసినందుకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ యూత్ వింగ్ సభ్యులు ఢిల్లీలో ఈరోజు ఆమె నివాసం ఎదుట నిరసన చేపట్టారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. "సుష్వా స్వరాజ్, వసుంధరా రాజేల ఎపిసోడ్ తో బీజేపీ అసలు స్వరూపం బయటపడింది" అని ఆప్ వింగ్ సభ్యుడు అశుతోష్ ఆరోపించారు. మరోవైపు సుష్మ నివాసం ముందు బారికేడ్లు ఏర్పాటుచేసి పోలీసులు నివారణ చర్యలు తీసుకున్నారు. ఇదిలాఉంటే యోగా డే వేడుకలలో పాల్గొనేందుకు సుష్మా ప్రస్తుతం న్యూయార్క్ లో ఉన్నారు.