: మొన్న మ్యాగీ నూడుల్స్... నేడు డెట్టాల్ సబ్బు
'నమ్మకమైన రక్షణ' అంటూ ప్రకటనలు గుప్పించే డెట్టాల్ సబ్బు నమ్మకమైన రక్షణను కల్పించడం లేదని తేలిపోయింది. డెటాల్ సబ్బుపై పరీక్షలు జరిపిన ఉత్తరప్రదేశ్ ఆహార, ఔషధ నియంత్రణ విభాగం.... డెట్టాల్ నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదని తేల్చింది. దీంతో, మ్యాగీ నూడుల్స్ తయారు చేసే నెస్లే కంపెనీ తర్వాత నాసిరకం ఉత్పత్తులు తయారు చేస్తున్న జాబితాలో మరో బహుళజాతి సంస్థగా డెట్టాల్ సబ్బును తయారు చేస్తున్న రెకిట్ బెనిక్సర్ (ఇండియా) చేరిపోయింది. అంతేకాకుండా, 125 గ్రాముల బరువున్నట్టు డెట్టాల్ సబ్బు కవర్ పై ముద్రించినా, అసలు బరువు 117.05 గ్రాములే ఉందని ఆగ్రా డ్రగ్ ఇన్స్ పెక్టర్ వెల్లడించారు. బరువు విషయంలో కూడా ప్రజలను డెట్టాల్ మోసం చేసిందని ఆయన చెప్పారు.