: కృష్ణా జిల్లాలో మళ్లీ చేపల వర్షం... ఆశ్చర్యపోతున్న కందలంపాడు గ్రామ ప్రజలు


కృష్ణా జిల్లాలో మరోసారి ఆకాశం నుంచి చేపలు పడ్డాయి. జిల్లాలోని నందిగామ మండలం గోళ్లమూడి, పల్లగిరి గ్రామాల పొలాల్లో చేపల వర్షం పడిన మరుసటి రోజే కంకిపాడు మండలం కందలంపాడు గ్రామ పొలాల్లో చేపల వాన కురిసింది. ఈ తెల్లవారుజామున పడిన వర్షానికి స్థానిక పొలాల్లో చేపలు కూడా కనిపించాయి. దీంతో స్థానికులంతా ఆశ్చర్యపోతున్నారు. వాటిని పట్టుకునేందుకు గ్రామస్థులు ఉత్సాహం చూపుతున్నారు. ఈ చేపలు ఒక్కొక్కటి మూడు నుంచి ఐదు కేజీల వరకు ఉండవచ్చని గ్రామస్థులు అంటున్నారు.

  • Loading...

More Telugu News