: రాజకీయ పార్టీలలో 'వన్ మ్యాన్ షోస్'కు నేను వ్యతిరేకం: అద్వానీ


భారత్ లో మళ్లీ అత్యవసర పరిస్థితి రావొచ్చంటూ తన వ్యాఖ్యలతో కలకలం సృష్టించిన బీజేపీ అగ్రనేత ఎల్. కె.అద్వానీ ఒకరోజు అనంతరం ఆ మాటలకు వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు ఏ ఒక్క వ్యక్తిపైనా కాదన్నారు. రాజకీయ పార్టీల్లో 'వన్ మ్యాన్ షోస్'కు తాను వ్యతిరేకమని చెప్పారు. అందుకే నేతలంతా అటల్ బిహారీ వాజ్ పేయీ అంత సచ్చీలురుగా ఉండాలని అద్వానీ కోరారు. "నేను చేసిన ప్రకటన ఏ ఒక్కరిపైనా కాదు. అన్ని రకాల నిరంకుశత్వాలకు మాత్రమే నేను వ్యతిరేకం" అని ఓ టీవీ చానల్ తో పేర్కొన్నారు. అహంకారం నిరంకుశత్వానికి మూలమని, అది చాలా బాధాకరమని అన్నారు. ప్రస్తుత రోజుల్లో నాయకులంతా వాజ్ పేయిలా నిగర్విలా ఉండాలన్నారు. అధికారంలోకి వచ్చిన ఎవరైనా దాన్ని పోగొట్టుకోవాలనుకోరని, ఒకవేళ ఎవరైనా అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఓటరు తప్పకుండా గుణపాఠం నేర్పుతాడని అగ్రనేత హెచ్చరించారు.

  • Loading...

More Telugu News