: ‘టీ న్యూస్’కు నోటీసులపై జర్నలిస్టుల ఆగ్రహం...12 గంటలకు డీజీపీ ఆఫీస్ ముందు ఆందోళన
ఓటుకు నోటు వ్యవహారంలో ‘టీ న్యూస్’కు ఏపీ పోలీసుల నోటీసులపై తెలంగాణ జర్నలిస్టులు భగ్గుమన్నారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత తమకు నోటీసులు జారీ చేసేందుకు వచ్చిన ఏపీ పోలీసుల ఎదుటే ‘టీ న్యూస్’ జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పత్రికా స్వేచ్ఛపై గళమెత్తారు. తాజాగా ఈ నోటీసులపై తెలంగాణ జర్నలిస్టులు నిరసనలకు సమాయత్తమవుతున్నారు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ డీజీపీ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టేందుకు నిర్ణయించారు. అంతేకాక నోటీసులను ఉపసంహరించుకునేదాకా ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు.