: సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేయండి...'ఓటుకు నోటు'పై జేపీ డిమాండ్
తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టిన ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వివాదాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ (జేపీ) డిమాండ్ చేశారు. నిష్పాక్షిక, విశ్వసనీయ విచారణ కోసం ఈ కేసులను సీబీఐకి అప్పగించాలని ఆయన వాదిస్తున్నారు. ఈ మేరకు నిన్న ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ లకు లేఖలు రాశారు. ఈ రెండు వివాదాలు తెలుగు ప్రజల మధ్య తీవ్ర మనస్పర్థలకు దారి తీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.