: ఫాంహౌస్ వద్ద కేసీఆర్ కు నిరసన సెగ... గేటు వద్ద బీడీ కార్మికుల ఆందోళన


తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీ షెడ్యూల్ నుంచి అప్పుడప్పుడు కాస్తంత విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వారంలో కనీసం ఒక్కసారైనా ఆయన విశ్రాంతికి వెళుతున్నారు. మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం ఎరవలి సమీపంలోని కేసీఆర్ సొంత వ్యవసాయ క్షేత్రం (ఫాంహౌస్) ఆయన విశ్రాంతికి నిలయంగా మారింది. అదే విధంగా నిన్న ఫాంహౌస్ కు వచ్చిన కేసీఆర్ కు అక్కడ నిరసన సెగ తగిలింది. వివరాల్లోకెళితే... అర్హత ఉన్నా ప్రభుత్వం అందిస్తున్న జీవనభృతి అందడం లేదంటూ కేసీఆర్ కు ఫిర్యాదు చేసేందుకు జగదేవ్ పూర్ కు చెందిన వంద మందికి పైగా బీడీ కార్మికులు వచ్చారు. అయితే అప్పటికే కేసీఆర్ ఫాంహౌస్ లోపలికి వెళ్లిపోగా, పోలీసులు గేట్లేశారు. సీఎంకు తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చామన్న బీడీ కార్మికులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. పోలీసులను నెట్టేసి మరీ కార్మికులు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ కార్మికులు గేటు ముందే ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News