: నన్ను తీసేశారు సరే...నిన్నెందుకు తీసేశారు: కరీనాను ప్రశ్నించిన సల్మాన్

కరణ్ జోహార్ తాజా సినిమాలోంచి తనను బయటకు గెంటేశారని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించాడు. తనను తీసేశారు సరే, నిన్నెందుకు తీసేశారని కరీనా కపూర్ ను సల్లూ భాయ్ ప్రశ్నించాడు. 'బజరింగీ భాయ్ జాన్' సినిమా ట్రైలర్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరణ్ జోహర్ రూపొందిస్తున్న 'శుద్ధి' సినిమా నుంచి తనను తరిమేశారని అన్నాడు. 'శుద్ధి' సినిమాలో హృతిక్ రోషన్, కరీనా కపూర్ జంటగా నటిస్తారని తొలుత ప్రకటించారు. తరువాత హృతిక్ స్థానంలో సల్మాన్ అన్నారు. ఇప్పుడు వరుణ్ ధావన్ అంటున్నారు. అసలింతకీ హీరో ఎవరు? అన్న ప్రశ్నకు స్పందించిన సల్లూ భాయ్ ఈ రకంగా కరీనాను అడిగాడు. దానికి ఆమె 'హృతిక్ ఉన్నాడు కాబట్టి అంగీకరించాను. మరి అతను లేడు కదా, అందుకని తప్పుకున్నా'నని చెప్పింది. అంటే సల్లూ భాయ్ కంటే ముందే కరీనా తప్పుకుందన్న మాట. కాగా, 'శుద్ధి' సినిమాలో వరుణ్ ధావన్ సరసన అలియా భట్ నటిస్తోంది.