: మాదకద్రవ్యాలను పసిగట్టడంలో జాగిలాలకంటే తేనెటీగలే బెస్టు!
మాదకద్రవ్యాలను పసిగట్టడంలో జాగిలాల కంటే తేనెటీగలే బెస్టు అని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. హెరాయిన్, కొకైన్ లాంటి మాదకద్రవ్యాలను జాగిలాల వలె తేనెటీగలు కూడా పసిగట్టగలవని, వాటికి శిక్షణ ఇస్తే, తక్కువ ఖర్చుతో విమానాశ్రయాల్లో మాదక ద్రవ్యాలను పట్టుకోవచ్చని వారు సూచిస్తున్నారు జర్మనీలోని గిస్సెన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. మాదకద్రవ్యాల వాసనను పసిగట్టి, అవి ఉన్న చోటుకు తేనెటీగలు వేగంగా వెళ్తాయని వారు తెలిపారు. వారి పరిశోధనల్లో జాగిలాల కంటే తేనెటీగలే తొందరగా మాదకద్రవ్యాలను చేరుకున్నట్టు పేర్కొన్నారు. అదీ కాక తేనెటీగలకంటే శునకాలకు శిక్షణనిచ్చేందుకు ఎక్కువ సమయం పడుతుందని వారు చెబుతున్నారు. అందుకే విమానాశ్రయాల్లో మాదక ద్రవ్యాలను పట్టుకునేందుకు శునకాలకు బదులు తేనెటీగలను వినియోగించుకోవాలని వారు సూచిస్తున్నారు.