: 20 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన పాక్ ఆర్మీ
ఉగ్రవాదులపై పాక్ సైన్యం దాడులను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో, ఈ రోజు 20 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. గిరిజన ప్రాంతాల్లోని ఉగ్రవాదుల స్థావరాలపై పాక్ సైన్యం ఈ రోజు వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఒక్క కైబర్ ఏజన్సీలోనే 18 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పెషావర్ లోని ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాదులు దాడి చేసి 140 మందిని పొట్టనబెట్టుకున్న తర్వాత వారి ఆగడాలు మరింత శృతి మించాయి. దీంతో కైబర్-2 ఆపరేషన్ పేరుతో పాక్ సైన్యం ఉగ్రవాదులపై దాడులను ముమ్మరం చేసింది.