: టేపుల పరిశీలనను ముమ్మరం చేసిన ఫోరెన్సిక్ అధికారులు


ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపుల పరిశీలనను ఫోరెన్సిక్ అధికారులు ముమ్మరం చేశారు. ప్రస్తుతం డీకోడింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. టేపుల పరిశీలనకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఆడియో, వీడియో ట్రాక్ లు ఒరిజినల్ వో, కాదో తేల్చే పనిలో ఈ బృందాల్లోని సభ్యులు ఉన్నారు. దీనికోసం, ఒరిజినల్ టేపులను కాపీ చేసి పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా, కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కోర్టు ద్వారా నోటీసులు జారీ చేసి, వారి వాయిస్ రికార్డ్ చేయనున్నారు. వీడియో ట్రాక్ ల నిర్ధారణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, ఆడియోలోని ప్రతి ఫ్రేమును చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News