: నేడు జరగాల్సిన అద్వానీ-కేజ్రీవాల్ ల సమావేశం రద్దయింది!


బీజేపీ అగ్రనేత ఎల్.కే.అద్వానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈ రోజు సమావేశం కావల్సి ఉండగా అకస్మాత్తుగా రద్దయింది. 6 గంటలకు ఢిల్లీలోని అద్వానీ నివాసంలో కేజ్రీ భేటీ కావాలని అనుకున్నారు. అయితే సమావేశం ఆగిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఇదిలా ఉంటే దేశంలో ఎమర్జెనీ రావొచ్చంటూ ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో అద్వానీ తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించగా, ఆయన మాటలకు కేజ్రీవాల్ మద్దతు పలికారు. అద్వానీజీ సరైన విధంగా చెప్పారని, ఢిల్లీయే తమకు మొదటి అనుభవమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే వారు సమావేశం కావాలనుకున్నట్టు పలువురు అంటున్నారు.

  • Loading...

More Telugu News