: కొడుకును కోర్టుకు లాగిన కోటీశ్వరుడు
ధనమేరా అన్నిటికీ మూలం అన్న సినీ కవి మాటల్ని ఔపోసన పట్టిన ఓ కోటీశ్వరుడు సొంత కొడుకునే అప్పుతీర్చలేదంటూ కోర్టుకు లాగిన ఘటన లండన్ లో చోటుచేసుకుంది. లండన్ కు చెందిన జార్జ్ స్టాసీ కొడుకు ఆర్ధర్ ఐటీ కన్సల్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. తన ఇల్లు బాగుచేసుకోవాలంటూ ఆర్ధర్ తండ్రి స్టాసీని పెద్దమొత్తం అప్పుగా అడిగాడు. వడ్డీతో తీర్చేస్తానని మాటిచ్చాడు. దీంతో స్టాసీ కుమారుడికి అప్పిచ్చాడు. 2013లో తండ్రి నుంచి పెద్ద మొత్తం తీసుకున్న ఆర్ధర్ ఇప్పటి వరకు ఒక్క పౌండ్ కూడా చెల్లించలేదు. దీంతో కుమారుడిపై న్యాయస్ధానంలో దావా వేశాడా తండ్రి. వడ్డీతో 3,00,000 పౌండ్లు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నాడు.