: భారీ వర్షంతో శివసేన వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు రద్దు
ముంబైని భారీ వర్షం ముంచెత్తుతోంది. దీంతో నగరంలోని జనజీవనం అస్తవ్యస్తం అయింది. అనేక చోట్ల పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో, ఈ రోజు జరగాల్సిన శివసేన వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కూడా రద్దయ్యాయి. మరోవైపు, భాండీ బజార్, కింగ్స్ సర్కిల్, ఒపేరా హౌస్, జీటీబీ నగర్ లలోని విద్యుత్ సబ్ స్టేషన్లను కూడా మూసేశారు. ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యగా ఈ పని చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.