: ట్రెండ్ ను కొనసాగించిన మార్కెట్... కోటి కోట్లు దాటిన మార్కెట్ విలువ
సోమవారం నాడు మొదలైన స్టాక్ మార్కెట్ లాభాల ట్రెండ్ వారం చివరి సెషన్లోనూ కొనసాగింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు దేశవాళీ ఫండ్ సంస్థలు సైతం ఉత్సాహంగా కొనుగోళ్లు జరిపాయి. శుక్రవారం నాటి సెషన్ ముగిసేసరికి సెన్సెక్స్ 200.34 పాయింట్లు పెరిగి 0.74 శాతం లాభంతో 27,316.17 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50.35 పాయింట్లు పెరిగి 0.62 శాతం లాభంతో 8,224.95 పాయింట్ల వద్దా కొనసాగాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ బరోడా, మారుతి సుజుకి, ఎన్ఎండీసీ, ఓఎన్జీసీ తదితర కంపెనీలు లాభపడగా, టాటా మోటార్స్, జడ్ఈఈఎల్, టాటా పవర్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్ తదితర కంపెనీలు నష్టపోయాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల విలువ కోటి కోట్ల రూపాయలను మరోసారి అధిగమించింది. బీఎస్ఈ ప్రాథమిక గణాంకాల మేరకు కంపెనీల మార్కెట్ కాప్ 1,00,04,412 కోట్లుగా ఉంది.