: స్టీఫెన్ సన్ ఏం చెప్పారు?: వాంగ్మూలం కాపీ కోసం రేవంత్ పిటిషన్


తెలంగాణ రాష్ట్ర నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ 'ఓటుకు నోటు' కేసులో ఇచ్చిన వాంగ్మూలం ఏసీబీ కోర్టుకు ఈ మధ్యాహ్నం చేరింది. దీంతో, ఆయన వాంగ్మూలం సర్టిఫైడ్ కాపీ కోసం రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆయనేం స్టేట్ మెంట్ ఇచ్చాడో తెలుసుకోవాల్సిన అవసరం తనకుందని పిటిషన్ లో రేవంత్ తెలిపాడు. ఈ మేరకు న్యాయవాదులు ఏసీబీ ప్రత్యేక కోర్టుకు పిటిషన్ అందించారు. స్టీఫెన్ సన్ న్యాయమూర్తి ముందు చెప్పిన విషయాలు పరిశీలించిన తరువాతనే ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై ఓ నిర్ణయానికి వస్తామని రేవంత్ తరపు న్యాయవాదులు వివరించారు.

  • Loading...

More Telugu News