: రాక్షసులపై పోరాడే శక్తి నాకుంది: చంద్రబాబు
ఏపీని తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంటే, వారికి సహకరిస్తూ వైకాపా నేత జగన్ నీచ రాజకీయాలు చేస్తున్నాడని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. చిత్తూరు పర్యటనలో ఉన్న ఆయన ఓ సభలో మాట్లాడుతూ, "అవినీతి నిర్మూలనకు నేను యజ్ఞం చేస్తున్నా, ఈ యజ్ఞానికి రాక్షసులు అడ్డుపడుతున్నారు. ఆ రాక్షసులతో పోరాటం చేసే శక్తి నాకుంది. తెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధిపై ధ్యాస లేదు. వారికి జగన్ వత్తాసు పలుకుతున్నాడు. అవినీతిని పారద్రోలేంత వరకూ నా పోరాటం ఆగదు" అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో చెరువుల్లో పూడికే తీయలేదని ఆరోపించిన ఆయన, పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీరు తీసుకొస్తే, తమ పరువుపోతుందని వైఎస్ఆర్సీపీ భయపడుతోందని విమర్శించారు.